30-07-2024 12:44:35 AM
ఆర్మూర్‌కు కూడా నిధులివ్వండి
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): కొడంగల్‌కు ఎన్ని నిధులైనా తీసుకెళ్లండి.. మాకు అభ్యంతరం లేదు.. అలాగే మా ఆర్మూర్‌కు కూడా నిధులు కేటాయించాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ నుంచి ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారని.. స్థానికంగా కంపెనీలు ఏర్పాటు చేస్తే ఇక్కడనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని.. వారంతా గల్ఫ్‌కు వెళ్లే పరిస్థితి తప్పుతుందని ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధ్ది ఫలాలు పేద వర్గాలకు అందేవిధంగా చూడాలన్నారు. ఆర్మూర్‌లో మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులివ్వాలని ఎమ్మెల్యే కోరారు.