calender_icon.png 2 May, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా వ్యాప్తంగా మే డే ఉత్సవాలు..

01-05-2025 07:45:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు బైంసా ఖానాపూర్ ముధోల్ కుంటాల లోకేశ్వరం ముధోల్ బాసర్ సోన్ నర్సాపూర్ రైతుల మండలాల్లో గురువారం మేడే ఉత్సవాల(May Day celebrations)ను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఐఎఫ్టియు ఏఐటీయూసీ సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రెండవ యూనియన్లు ఆటో యూనియన్ ప్రైవేట్ ఆర్టీసీ బస్సు డిపో యూనియన్ ఎమ్మెల్యే స్పాట్ గోదాం కార్మికులు సిపిఐ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాను ఎగరవేసి పట్టణాల్లో గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ముందుకు వెళ్దామని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న లక్ష్మి శ్రీనివాస చారి విలాస్ ఎస్ ఎన్ రెడ్డి తదితరులు ఉన్నారు అలాగే బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూడా మేడే ఉత్సవాలను నిర్వహించారు.