01-05-2025 07:37:51 PM
బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి..
మంథని (విజయక్రాంతి): దేశంలోని ప్రజలందరికీ కులగణనతో పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా మాజీ బిజెపి అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ రెడ్డి మాట్లాడుతూ... ప్రధాని మోడీ తీసుకున్న కులగణన నిర్ణయం చరిత్రాత్మకమని, దేశంలోని అన్ని కులాల ప్రజల, వారి ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వారికి న్యాయం చేసేందుకే దేశవ్యాప్తంగా కులగనాన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
20, 26 సెన్సేషన్ లో భాగంగా భారతదేశంలో కులగణన్ని చేసి దేశ ప్రజలకు మోడీ న్యాయం చేస్తారని సునీల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండుసార్లు దేశంలో కుల గణాన పేరుతో ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన కులగనాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూతూ మంత్రంగా నిర్వహించి రాష్ట్రంలోని బీసీలను ముస్లింలతో కలిసి కేవలం 52% శాతం మాత్రమే చూపించారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న అసెంబ్లీలో ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారని, దానిలో ముస్లింలను కలుపుకొని బీసీ రిజర్వేషన్ ఇవ్వడంతో బీసీలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.
మంథనిలో డివిజన్ క్లబ్ ఏర్పాటు శుభపరిణామం
మంథని కేంద్రంగా మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామం అని చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. మీడియా ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియా మిత్రులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచార సేకరణ చేసి వారికి సమాధానం అందిస్తున్న నాలుగవ స్తంభమైన మీడియా నిరంతరం ప్రభుత్వ లోటు పాట్లను ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేలా వార్తలు ప్రచురించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ మిత్రులను ఆయన అభినందించారు. మీడియా మిత్రులకు, కార్మికులకు సునీల్ రెడ్డి మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట బిజెపి నాయకులు పోతరవేణి క్రాంతికుమార్, కృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.