01-05-2025 07:28:22 PM
మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు..
మంథని (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT Minister Duddilla Sridhar Babu) అన్నారు. గురువారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్(Media Press Club) ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు గురువారం ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులతో పాటు 50 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజలకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియా విలువలతో కూడుకున్నదని, పాత్రికేయులు తమ వార్తలు సేకరణలో ఎంతో శ్రమిస్తారని అన్నారు. ఎలాంటి వివక్షలకు పావు లేకుండా పాత్రికేయులంతా కలిసిమెలిసి పనిచేయాలని కోరారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులకు ఇళ్లస్థలాలు అందజేశామని గుర్తు చేశారు. పాత్రికేయులకు సంక్షేమ పథకాల అమలు కోసం తప్పకుండా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి మేమెంటో అందజేశారు. అదేవిధంగా మంత్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోత్కూరీ శ్రీనివాస్ మాట్లాడుతూ... చిన్న పెద్ద పత్రికలు అనే తారతమ్యం లేకుండా సీనియర్ జూనియర్ అనే వివక్ష లేకుండా అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని, మంత్రి డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ గురించి కొందరు దుష్ప్రచారం చేస్తూ హేళనగా మాట్లాడడం మానుకోవాలని హితో పలికారు.
తమ ప్రెస్ క్లబ్ పై, తమ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలగాలన్నారు. పాత్రికేయులకు చిన్న, పెద్ద పత్రికల తారతమ్యం మేము ఉండదని విలువలతో కూడిన వార్తలు రాసినప్పుడే పాత్రికేయుడు సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవంలో తమకు అప్పగించిన బాధ్యతలను ఎంతో శ్రమకోర్చి కార్యక్రమం విజయవంతనికి కృషి చేసిన పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొడాలి మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు జబ్బార్ ఖాన్, బొల్లవరం విజయనందారావ్, ప్రెస్ క్లబ్ నాయకులు గడిపల్లి అజయ్, కుమార్, కిషన్ యాదవ్, మహావాది సతీష్, ఎలువాక కుమార్, శ్రీనివాస్ రెడ్డి, వీరాస్వామి, తూర్పాటి రాము, కాట వినయ్, రాజబాబు, వాసు గౌడ్, మహేందర్, రవీందర్, లక్ష్మణ్, శ్రీను, సభ్యులు పాల్గొన్నారు.