calender_icon.png 2 May, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికాగో అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం

01-05-2025 07:43:07 PM

సిపిఎం మండల కార్యదర్శి శీలం అశోక్...

హుజురాబాద్ (విజయక్రాంతి): చికాగో అమరవీరుల స్ఫూర్తితో పోరాడుదాం అని సిపిఎం మండల కార్యదర్శి అశోక్ ఉన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట పట్టణంలో గురువారం 139వ మే డే వేడుకలు ఘనంగా నిర్వహించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప" అనే నినాదంతో 1886లో చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినాల కోసం చేసిన ఉద్యమాన్ని గుర్తు చేశారు. హే మార్కెట్ వద్ద జరిగిన పోలీసులు కాల్పుల్లో కార్మికులు మరణించిన దురంతమే ఈ రోజు కార్మికుల సంఘటిత పోరాటాలకు బీజం వేసిందన్నారు.

ఈ ఘటన స్ఫూర్తితో 1890 మే 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని వ్యవస్థ అమలులోకి వచ్చిందని, అందుకే ప్రతి సంవత్సరం మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయించేందుకు కార్మికులు ఐక్యతగా పోరాడాలని పిలుపునిచ్చారు. గతంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పోరాడి విజయాన్ని సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆ ఉద్యమంలో 750 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని, ఆ మరణాలు వృథా కాకూడదని అన్నారు.నేడు కార్మికులు కనీస వేతనం పొందకపోవడం, రైతులకు గిట్టుబాటు ధర కలగకపోవడం వంటి సమస్యలపై బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నడుస్తోందని ఆరోపించారు.జూన్ 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్, వడ్లూరి కిషో తో పాటు తదితరులు పాల్గొన్నారు.