calender_icon.png 2 May, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పిఎసిఎస్ చైర్మన్

01-05-2025 07:48:30 PM

మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని ఉదయం అకాల వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఎసిఎస్ చైర్మన్ చల్లా తిరుపతి రెడ్డి(PACS Chairman Challa Thirupathi Reddyసందర్శించారు. మండలంలో గురువారం అకాల వర్షం కురవడంతో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే 9 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల కేంద్రంతో పాటు, బెంగళూరు, అంబటిపల్లి, సూరారం, కాళేశ్వరం, గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నూతన ఆలోచనతో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని సంకల్పంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర ప్రకటిస్తూ దాన్యం కొనుగోలు చేసేదని గుర్తు చేశారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనతోటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మంథని నియోజకవర్గం లో అన్ని వర్గాల ప్రజలకు మంత్రి  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పలాలు అందే విధంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మద్దతు ధర ప్రకటిస్తూనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీసీ రాజ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.