calender_icon.png 2 May, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు బసవ జయంతి శోభాయాత్ర

01-05-2025 08:08:30 PM

నిర్మల్ (విజయక్రాంతి): బసవ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో వీరశైవ లింగాయత్ సంఘం ఆదరణ బసవ జయంతి శాంతి శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు మారుతి పటేల్ పాండురంగ సాయి పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జయంతి ఉత్సవాలను వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని కడ్డ హోటల్ చౌరస్తా నుండి వీరశైవ లింగాయత్ శోభాయాత్ర ప్రారంభించి నరసింహ నగర్ వరకు కొనసాగుతుందని సంప్రదాయ పద్ధతిలో భాజా భజంత్రీలు లింగ పూజతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. విశ్వగురు బసవేశ్వర్ అభిమానులు వీరశైవ లింగయ్య సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయాలని వారు పిలుపునిచ్చారు.