calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియాకు ప్రత్యామ్నాయం

19-09-2025 12:46:32 AM

-పెరుగుతున్న అమ్మోనియం సల్ఫేట్ వినియోగం 

-మహబూబాబాద్ జిల్లాలో రైతుల వాడకం

-పంటలు దక్కాలంటే తప్పదంటున్న అన్నదాతలు

మహబూబాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): యూరియా కొరత నేపథ్యంలో పంటలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నా య మార్గాలను అన్నదాతలు చూసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరి యాకు ప్రత్యామ్నాయంగా అమోనియం సల్ఫేట్ 20 20 0 13 ఎరువు వినియోగిస్తున్నారు. తమకు లభించిన అరకొర యూరి యాతో పంటలను కాపాడుకునే పరిస్థితి లేకపోవడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేసిన పలువురు రైతులు అమ్మోనియా సల్ఫేట్‌ను వినియోగిస్తున్నారు.

అమ్మోనియా సల్ఫేట్ ఒక బస్తా ఖరీదు రూ.950 ఉండగా దాదాపు రెండు ఎకరాలకుపైగా పంటకు సరిపోతుంది. ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన రైతులు యూరియా సరిపడా లభించకపోవడం, రోజుల తరబడి టోకెన్లు, యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడే పరిస్థితి లేక అమోనియా సల్ఫేట్ కొను గోలు చేస్తున్నట్లు ఎరువుల వ్యాపారులు చెపుతున్నారు.

యూరియాకు ప్రభుత్వం ఇస్తు న్న సబ్సిడీతో బస్తా ధర రూ.266. ఇది ఒక ఎకరానికి సరిపోతుంది. అమ్మోనియా సల్ఫేట్ బస్తా రూ.950 లభిస్తుండగా రెండు ఎకరాల కు సరిపోతుంది. యూరియా ధరతో పోలిస్తే ఎక్కువే అయినా.. యూరియా కొరత, రోజుల తరబడి నిరీక్షణ, అదును దాటుతుండడంతో పంటల రక్షణకు అమోనియా సల్ఫేట్ వాడ కం తప్పడం లేదని రైతులు అంటున్నారు. 

అమోనియా సల్ఫేట్ పంటలకు మేలు ఛాయారాజ్, వ్యవసాయ అధికారి, సిరోల్ 

యూరియాకు బదులు అమ్మోనియా సల్ఫేట్ వినియోగం వల్ల పంటలకు మరింత మేలు చేస్తుంది. అమోనియా సల్ఫేట్‌లో 24 శాతం సల్ఫర్ ఉంటుంది. మొక్కల పెరుగుదల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. యూరియాలో సల్ఫర్ ఉండదు. సీజన్‌లో మొక్కలకు నత్రజనిని సరఫరా చేయడానికి అమ్మోనియం సల్ఫేట్ అనుకూలంగా ఉంటుంది. యూరియా వినియోగంతో పోలిస్తే అమోనియం సల్ఫేట్ వల్ల అమ్మోనియా ఉద్గారాలు తక్కువగా ఉంటాయి. పర్యావరణానికి కొంత మేలు చేస్తుంది. యూరియా కొరత నేపథ్యంలో అమ్మోనియా సల్ఫేట్ ఎరువు వినియోగం రైతులకు ఉపయోగకరంగా, పంటలకు మేలు చేసే విధంగా ఉంటుంది.