calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెపోటుతో యువకుడి మృతి

19-09-2025 12:45:51 AM

ఇబ్రహీం పట్నం, సెప్టెంబర్ 18: గుండె పోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా కనిపించిన వారు క్షణాల్లోనే విలవిల్లాడుతూ కుప్పకూలుతున్నారు. తాజాగా.. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకుంది.

ఓ 30 ఏళ్ల యువకుడు జ్యూస్ తాగుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా, పల్లిపాడు గ్రామానికి చెందిన మేడ ఏకలవ్య (30), ఉపాధి కోసం ఇబ్రహీంపట్నం వచ్చి నివాసం ఉంటున్నాడు. కాగా బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో రిలయన్స్ ట్రెండ్స్ ముందు జ్యూస్ పాయింట్ వద్ద జ్యూస్ త్రాగుతూ ఆకస్మాతుగా కిందపడిపోయి, అక్కడికక్కడే మృతి చెందాడు.

దింతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.