17-08-2025 11:22:05 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఇంచార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదివారం తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులంతా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్నందున, ప్రజలు కూడా జిల్లా కేంద్రానికి రావడానికి ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.