17-08-2025 11:04:39 PM
బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ పరివాహక ప్రాంతం నుండి వరద నీరు భారీగా ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని, సోమవారం ఏ సమయంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి మాజీరా నదిలోకి వదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారని, నది పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు మంజీరా పరివాహక ప్రాంతంలోకి గొర్రె కాపరులు, పశువుల కాపర్లు, చేపలు పట్టేవాళ్లు, రైతులు మంజీరా పరివాహంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రెవెన్యూ పోలీసు శాఖల వారికి సమాచారం అందించాలని, లేదా 100 డైల్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.