17-08-2025 11:33:51 PM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. సామ్ కోసి
హనుమకొండ,(విజయక్రాంతి): చాలాకాలంగా ఉమ్మడి జిల్లాలోని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలంటే మధ్యవర్తిత్వం ద్వారా రాజీమార్గాన్ని కుదిర్చి కేసులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. సామ్ కోష్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండలోని డిసిసి బ్యాంకులో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన న్యాయ సేవ సంస్థల శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ... మధ్యవర్తిత్వం ప్రపంచీకరించబడిందని కోర్టుల భారాన్ని చాలావరకు తగ్గిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన మధ్యవర్తులు వారి అపర అనుభవంతో న్యావాదులను, మధ్యవర్తులుగా మెలుకవలు నేర్పించాలని సూచించారు. కార్పొరేట్ సంస్థల వ్యాపారాలు, కంపెనీల వివాదాల పరిష్కారం కోసం మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయిస్తున్నారని తెలిపారు.
మధ్యవర్తిత్వం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని కక్షిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీల సేవలను అందిస్తున్నారని తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని న్యాయవాదులు సద్వినియోగంపరచుకొని మెలకువలు పాటించాలని కోర్టు కేసులలోని కక్షిదారుల రాజీ కుదుర్చుకొని విధంగా ప్రయత్నాలు కొనసాగించాలని కోరారు.