calender_icon.png 30 June, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

29-06-2025 08:14:31 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ మండలంలోని జడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 1984-85 సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థులు సుమారు 50 సంవత్సరాలు తర్వాత తమకు బోధించిన ఉపాధ్యాయులతో తమ తోటి విద్యార్థులతో కలిసి ఉండడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఆదివారం మండలంలోని జడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ  సమ్మేళనానికి విద్యార్థులు, తమకు విద్యను బోధించిన అధ్యాపకులతో కలిసి ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. వేరువేరు రంగాల్లో ఎక్కడెక్కడో స్థిరపడి సుమారు 50 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

తమ స్కూల్లో విద్యాభ్యాసం అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. నాటి రోజులను గుర్తు చేసుకొని ఓల్డ్ ఇస్ గోల్డ్ అని కొనియాడారు. అలనాటి ఉపాధ్యాయుల బోధనలు తమకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఆ చదువులే ఇప్పుడు మా పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ప్రోత్సహించాయని తెలిపారు. ఆనాడు బోధించిన ఉపాధ్యాయుడు హనుమంత రెడ్డి  జీవితపు చివరి సమయంలో తను ఏ విధంగా ఉంటున్నానో తెలియజేసి తమ వద్ద విద్యను అభ్యసించిన వారందరికీ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు ఆనందంతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఉపాధ్యాయులు అలనాటి జ్ఞాపకాలను చేసుకుంటూ ఉల్లాసంగా గడిపారు.