25-08-2025 12:00:00 AM
కామారెడ్డి, ఆగస్టు 24 (విజయ క్రాంతి) ః 40 సంవత్సరాలకు పదో తరగతి పూర్తి చేసిన తర్వాత మిత్రులు కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1984 85 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశారు. అప్పటినుండి వేరువేరు వృత్తుల్లో స్థిరపడ్డారు.
అందరం ఒక చోటికి చేరి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం కామారెడ్డి మండలం గర్గుల్ శివారులో నీ ఫార్మ్ హౌస్ లో కలిసి తమ ఆత్మీయ మిత్రు అందరూ కలిసి చిన్ననాటి పాత జ్ఞాపకాలను, పాఠశాల స్థాయిలో చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుని సంబర పడ్డారు. తమ తోటి చదివిన ముగ్గురు మిత్రులు వివిధ అనారోగ్య కారణాలతో మృతి చెందిన వారికి నివాళులర్పించారు.
అనంతరం భోజనాలు ఏర్పాటు చేసుకొని సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పశువైద్యాధికారి సాయి రెడ్డి, ఆర్‌ఎంపి వైద్యులు లక్ష్మీనారాయణ, యాడారం రమేష్, సంకరి వెంకటరాములు, బంధం శ్రీనివాస్, ముదాం నారాయణ, ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రంగంపేట శ్రీనివాస్, విజయ్ సింగ్, నాగభూషణం, రామ్ రెడ్డి, బాపురెడ్డి, గంపల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.