calender_icon.png 29 December, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్వాల్ డీసీపై సస్పెన్షన్ వేటు

29-12-2025 01:54:49 AM

వివాదాలకు కేరాఫ్ శ్రీనివాస్‌రెడ్డి

బదిలీ ఉత్తర్వులు బేఖాతరు 

కవాడిగూడలో రిపోర్ట్ చేయకుండా గైర్హాజరు

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించి, బదిలీ అయిన స్థానంలో విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిప్యూటీ కమిషనర్ వి శ్రీనివాస్ రెడ్డిపై బల్దియా కమిషనర్ ఆర్‌వి కర్ణన్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ చేస్తూ ఆదివా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అల్వాల్ సర్కిల్ నుంచి కవాడిగూడ సర్కిల్ బాధ్యతలు అప్పగించారు. తక్షణమే అక్కడ రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆయన వాటిని పాటించలేదు.

పైగా విధులకు గైర్హాజరయ్యారు. అత్యవసర సమయాల్లో, ముఖ ్యంగా మెగా సానిటేషన్ డ్రైవ్ వంటి కీలక కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన కమిషనర్ కర్ణన్.. విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెన్షన్‌లో ఉంచుతూ నిర్ణయం తీసుకున్నా రు. తెలంగాణ రాష్ట్ర లా డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయనపై తదుపరి శాఖాపరమైన విచారణ జరగనుంది. కాగా శ్రీనివాస్‌రెడ్డిపై గతంలోనూ అనేక ఆరోపణలు న్నా యి. అల్వాల్ సర్కిల్‌లో పనిచేసిన సమయంలో నిబం ధనల కు విరుద్ధంగా ఖాళీ స్థలాలకు పెద్ద సంఖ్యలో ఇంటి నెం బర్లు మంజూరు చేశారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిగినట్లు తెలిసింది.

ఓ సీనియర్ సిటి జన్‌కు సంబంధించిన ఆస్తి పన్ను మదింపులో ఆయన తన పరిధిని మించి వ్యవహ రించారని, బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచా రం. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా శ్రీనివాస్ రెడ్డి పనితీరుపై పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలను దాచిపెట్టడం, స్థానిక ఎమ్మెల్యేగా తన ప్రోటోకాల్‌ను గౌరవించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. ఈ వరుస ఫిర్యాదులు, తాజా ధిక్కరణ వెరసి.. సస్పెన్షన్ వేటుకు దారితీశాయి.