20-05-2025 12:04:13 AM
ఉదారత చాటుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి టౌన్, మే 19 (విజయక్రాంతి),: కారుణ్య నియామకాల్లో భాగంగా ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగ ఉత్తర్వులను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు.
రెండు నెలల క్రితం విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వడ్ల రవి కూతురు సౌఖ్య కు, అలాగే అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ రమేష్ కుమార్తె మానస కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక పత్రాలు సోమవారం ఆయన అందజేశారు.
నియామక పత్రాలు అందుకున్న వెంటనే ఈరోజు నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో సౌఖ్య, మానస విధుల్లో చేరారు. ప్రమాదం జరిగి మరణించిన వడ్ల రవి, అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ రమేష్ కూతుర్లకు రెండు నెలల లోపే నియామక పత్రాలు అందజేసి జిల్లా ఎస్పీ తన ఉదారతను చాటుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు విడతల వారీగా కారుణ్య నియామకాలలో ఉద్యోగాలు వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈరోజు ఉద్యోగాల్లో నియమితులైన సౌఖ్య, మానసల ను ఆయన అభినందించారు.
తమ తండ్రుల్లాగా విధుల్లో నిజాయితీగా నిధులు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆయన వారికి సూచించారు. విధులు నిర్వహిస్తూ మరణించిన ఇరు కుటుంబాలకు రెండు నెలల లోపే కారుణ్య నియామక ఉద్యోగ పత్రాలు అందించిన జిల్లా ఎస్పీకి ఈ సందర్భంగా జిల్లా పోలీసు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కే .నరసింహారెడ్డి, ఏవో ఎండి. అప్సర్, సూపరిండెంట్లు గంగాధర్, జమీల్ అలీ తదితరులు పాల్గొన్నారు.