calender_icon.png 19 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ వర్సిటీగా ‘అంబేద్కర్ ఓపెన్’

19-11-2025 12:59:26 AM

  1. నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం
  2. టెక్నాలజీతో నాణ్యమైన విద్యను అందిస్తుంది
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  4. ఐడీఈఏ ఏర్పాటుకు కామన్‌వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌తో వర్సిటీ ఎంవోయూ

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివ ర్సిటీ డిజిటల్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఐడీఈఏ అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుందని తెలిపారు. మంగళవారం సీఎం నివాసంలో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అకాడమీ (ఐడీఈఏ) ఏర్పాటుకు కామన్‌వెల్త్ ఆఫ్ లెర్నింగ్ (సీవోఎల్)తో రేవంత్‌రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని వర్సిటీ అధికారులు కుదుర్చుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యాప్రమాణాలు పెంచడంతోపాటు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించా రు. రాష్ర్టంలోని వర్సిటీలను బలోపేతం చేయడంతోపాటు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కామన్‌వెల్త్ ఆఫ్ లెర్నింగ్ అధ్యక్షుడు పీటర్ స్కాట్‌కు సీఎం వివరించారు.

బోధన, అభ్యాసం, పరిశోధనలను మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అకాడమీ అత్యాధునిక డిజిటల్ హబ్‌గా పనిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.