calender_icon.png 19 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోమయ ప్రమిదలతో దీపోత్సవం

19-11-2025 12:59:32 AM

జవహర్ నగర్, నవంబర్ 18 (విజయ క్రాంతి):  కార్తీక మాసం చివరి సోమవారం  రోజును పురస్కరించుకొని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ నగర్ యాదవ సంఘం శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గోమాయ ప్రమిదలతో దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్  జిల్లా ఉపాధ్యక్షురాలు కమల్ పంత్ మాట్లాడుతూ ఆవు పేడతో చేసిన ప్రమిదలు అనేవి పర్యావరణ హితమైన సాంప్రదాయమని, సురక్షితమైనవనీ, పర్యావరణానికి హాని కలిగించవని. ఈ ప్రమిదలను వాడడం సాం ప్రదాయానికి ప్రతీకా అని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్  జిల్లా కార్యదర్శి రజినీకాంత్, దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్  అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.