19-11-2025 12:58:45 AM
హైడ్రా కమిషనర్ రంగనాథ్
మొయినాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి ): విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న స్వామి నారాయణ్ గురుకుల్ సేవలు అభిందనీయం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనియాడారు. త్వరలోనే గురుకుల పాఠశాలను సందర్శిస్తానని ఆయన హామీనిచ్చారు. స్వామినారా యణ్ గురుకుల్ హైదరాబాద్ ఆర్గనైజర్ సాధు శుక్వల్లభ్దాస్ హైడ్రాకమిషనర్ వి. రంగనాథ్, ఐ.పి.ఎస్. ని ఆయన కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ ఈ సందర్భంగా గురుకుల విద్య గురించి, విద్య సిస్తున్న విద్యార్థుల గురించి కమిషనర్ కు వివరించారు వివరించారు. అంకితభావం మరియు నాయకత్వంపై తమ అమూల్యమైన మాటలతో అధ్యాపకులను ప్రేరేపించడానికి త్వరలో గురుకుల క్యాంపస్ను సందర్శించాల్సిందిగా స్వామిజీ కమిష నర్ను ఆహ్వానించగా.. దీనికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ స్పందించినట్లు చెప్పారు. స్వామినారాయణ్ గురుకుల్ పూర్వ విద్యార్థి అయిన తన కుమారుడు కౌశిక్ విలువ విద్య ద్వారా ఉన్నంతముగా ఎదిగినట్లు ఈ సందర్భంగా కమిషనర్లు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ 77 సంవత్సరాల చరిత్ర కలిగిన లాభాపేక్ష లేని సంస్థ. ఇది విద్యా నైపుణ్యానికి, దేశ వారసత్వం, సంస్కృతి మరియు విలువలను పెంపొందించడానికి కృషి చేస్తుండన్నారు. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65+ క్యాంపస్లలో 1,25,000 మందికి పైగా విద్యార్థులకు సేవలు అందిస్తోందన్నారు.