calender_icon.png 4 July, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

03-07-2025 01:30:38 AM

శ్రీనగర్, జూలై 2: జమ్మూ కశ్మీర్‌లోని కిష్తార్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. ‘ఆపరేషన్ ఛత్రు’లో భాగం గా బుధవారం ఉగ్రవాదుల జాడ కోసం కిష్తార్‌లోని ఛాత్రు ఏరియాలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్ 16 భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఎదురయ్యారు. దీంతో ఎదురు కా ల్పులు జరిపిన భద్ర తా దళాలు ము గ్గురు ఉగ్రవాదులను తుద ముట్టిం చినట్టు తెలిపారు. కాగా ఉగ్రవాదు లను హతం  చేసేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.