12-09-2025 12:59:39 AM
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
రోడ్ల పై చెత్తతో జనం అవస్థలు
చివరికి మిగిలింది.. అపరిశుధ్యమే
మణుగూరు, సెప్టెంబర్ 11 (విజ యక్రాంతి) : పల్లె స్వచ్ఛతే లక్ష్యం, పరిశుభ్రతకు ఓ పథకం.సేకరించిన చెత్తతో.. సేంద్రి య ఎరువు తయారీ... అమ్మితే లాభాలు. లక్షణంగా షెడ్లు కట్టారు. లాభాల మాటెలా ఉన్నా.. అధికారులు లక్ష్యం మరిచి పోయా రు. దీంతో గ్రామ పంచాయతీలలో నిర్మించిన కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా దర్శన మిస్తున్నాయి. దీనిపై విజయక్రాంతి కథనం..
ఆశయం గణం..
గ్రామాల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామ పంచాయతీకు ఆదాయం సమకూర్చాలనే సదుద్దేశం తో గత ప్రభుత్వ హయంలో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలలో కంపోస్ట్ షెడ్లను నిర్మించా రు. అందులో భాగంగా మణుగూరు మండలంలోని 14 పంచాయతీలలో కంపోస్ట్ షెడ్లనుని ర్మించారు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి జా తీయ ఉపాధి హామీ నిధులు రూ.2.50 లక్ష లు ఖర్చు చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతో అవి నేడు నిరుపయోగంగా మారాయి. ఇం టింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్న లక్ష్యం నీరుగారింది. గ్రామ శివారులో నిర్మించిన షెడ్లు నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వీటి పై పంచాయతీ సిబ్బందికి ఎలాంటి పట్టింపు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వి సింగారంలో... నిరూపయోగం
నివాస ప్రాంతాల నుంచి చెత్తను సేకరించి కంపోస్టు ఎరువుగా మార్చి సదుద్దేశం తో విప్పలసింగారం పంచాయతీలో కంపోస్ట్ షెడ్ నిర్మించారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం కోసం విడివిడిగా చిన్న పాటి గదు ల్లా నిర్మాణాలు చేపట్టారు.
ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు, పేపర్లు, అట్టముక్కలు, కరెంటు వస్తువులు,పాతదుస్తు లు ఇలా వివిధ రకాల వ్యర్థాలను వేరు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రారంభ దశలో నిర్వహణపై ఆసక్తి కనబర్చిన అధి కార యంత్రాంగం అనంతర పట్టించుకోకపోవడంతో షెడ్ నిరూపయోగంగా మారింది.
అపరిశుధ్యమే..
విప్పల సింగారం గ్రామ పంచాయ తీలో చెత్తను, వ్యర్థ పదార్ధాలను నేరుగా కంపోస్టుకు షెడ్డుకు తరలించకుండ, పంచాయతీ సిబ్బంది రోడ్ల వెంట గుంతల్లో పడేస్తున్నా రు. దీంతో గ్రామాల్లోని రోడ్ల వెంట చెత్త ద ర్శనమిస్తోంది. తడి, పొడి చెత్తను వేరు చే యడం ఇక కంపోస్టు షెడ్ లో సేంద్రియ ఎరువు తయారీ పై పంచాయతీ కార్మికులు దృష్టి పెట్టలేదనే విమర్శలు కూడా ఉన్నా యి.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామం లో ఏర్పాటు చేసిన కంపోస్టు షెడ్ నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు ఆరోపి స్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంపోస్ట్ షెడ్లను ఉపయోగంలోకి తీసుకు రావాలని పలువురు కోరు తున్నారు.
చర్యలు తీసుకుంటాం
తడి, పొడి చెత్త వేరు చేయాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ డంప్ చేయవద్దని పంచాయతీ సిబ్బందికి సూచిస్తున్నాము. కంపోస్ట్ షెడ్ ను వినియోగంలోకి తీసుకువస్తాం. వాటి ద్వారా వచ్చిన ఎరువును గ్రామపంచాయతీ నర్సరీలలో మొక్కలకు వినియోగిస్తాము.
పలనాటి వెంకటేశ్వరరావు ఎంపీఓ మణుగూరు