calender_icon.png 27 October, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో అగ్రగామిగా అమీన్‌పూర్

27-10-2025 12:24:06 AM

ఎమ్మెల్యే జిఎంఆర్ 

అమీన్ పూర్, అక్టోబర్ 26 :అమీన్ పూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు ఆర్టీసీ కాలనీలో కోటి రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన సీసీ రోడ్డు పనులకు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు మహదేవరెడ్డి, కొల్లూరి మల్లేష్, గోపాల్, కాలనీ వాసులు పాల్గొన్నారు.