25-12-2025 12:18:03 AM
మచ్చుపేటలో 108 అంబులెన్స్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
ముత్తారం, డిసెంబర్ 24 (విజయ క్రాంతి) ప్రజలకు వేగవంతమైన అత్యవసర వైద్య సహాయం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 108 అత్యవసర సేవలను అందుబాటులో ఉంచుతుందని బుధవారం మచ్చుపేటలో,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దు ద్దళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదాలు, అకస్మాత్తు అనారోగ్యాలు, గర్భిణీ స్త్రీల అత్యవసర పరిస్థితుల్లో 108 సేవలు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఆధునిక సాంకేతికతతో కూడిన అంబులెన్సులు, శిక్షణ పొందిన సిబ్బందితో 108 సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం తక్షణ వైద్య సేవలు అందేలా ఈ వ్యవస్థను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్ వేణు ఆర్డీవో సురేష్ తాసిల్దార్ మధుసూదన్ రెడ్డి డిఎంహెచ్వో ప్రమోద్ కుమార్ ముత్తారం ప్రభుత్వ వైద్యాధికారి అమరేందర్రావు,సంబంధిత శాఖాధి కారులు, వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం,
మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ జెడ్పిటిసి సభ్యుడు నాగినేని జగన్ మోహన్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, డైరెక్టర్లు బుచ్చం రావు మచ్చుపేట సర్పంచ్ సిలివేరు జ్యోతి లక్ష్మణ్ మహిళా మండల అధ్యక్షురాలు గోవిందుల పద్మ ఆనంద్ ముత్తారం మాజీ సర్పంచ్ రజిత రఫీ డాక్టర్ చారి, మచ్చుపేట ఉప సర్పంచ్ దొంతుల రాకేష్ పాల్గొన్నారు 108 సేవలను అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు.
దుండె రాజేశం మరణం కాంగ్రెస్ పార్టీ తీరని లోటు
మచ్చుపేటలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సింగరేణి కార్మికుడు ఐఐటియుసి నాయకుడు దుండె రాజేశం మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మచ్చుపేటలో కూతురు అల్లుడు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరణ చేశారు.