18-12-2025 06:08:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ సర్పంచులను శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి సన్మానం చేయనున్నట్టు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ సమ్మేళనానికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి నాగేష్ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పాల్గొంటారని ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు పిలుపునిచ్చారు.