30-09-2025 12:00:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్ సెప్టెంబర్ 29(విజయ క్రాంతి): వాంకిడి మండలంలోని బెం డర గ్రామంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచ ర్‌పై జరిగిన కుల వివక్షతపై , ఆసిఫాబాద్ మండలంలోని కొమ్ముగూడ గ్రామంలో జరిగిన కుల బహిష్కరణపై అధికారులు వెంటనే స్పందించి బాధితులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ అండ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు కోరారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయ ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, భారతీయ బోదమసభ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహుల్కర్ , బంజారా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపాల్ నాయక్ మాట్లాడుతూ ఈ సంఘటనలు జరిగి దాదా పు రెండు నెలలు గడుస్తున్నప్పటికీ గ్రామం లో సాధారణ వాతావరణం నెలకొనలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షతకు గురై న గ్రామాలలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించిన సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలని అదేవిధంగా సహపంక్తి భోజనాలను ప్రభుత్వం తరఫునుంచి నిర్వహించాలని కోరారు.
స్థానిక సంస్థల ఎన్నిక లు వచ్చిన వేళ ఇలాంటి కుల వివక్షత పై అధికారులు చర్యలు తీసుకోకుంటే గొడవలు జరిగే పరిస్థితి ఉంటుందన్నారు. గ్రామాలలో అధికారులు వెళ్లి ఈ వివక్షత పట్ల గురైన వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదేవిధంగా వివక్షతకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఆర్బిఐ మాజీ అధ్యక్షులు శ్యామ్ రావు డోండుజి దుర్గే, వాంకిడి మండల అంబేత్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ ఉప్రే , కోశాధికారి నాగ సేన్ ఉప్రే తదితరులు పాల్గొన్నారు.