calender_icon.png 23 October, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలానగర్ కో-ఆపరేటివ్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ భూముల్లో అవినీతిపై విచారణ జరిపించాలి

23-10-2025 12:00:00 AM

ప్రభుత్వానికి సంస్థ డైరెక్టర్ సయ్యద్ బద్రుద్దీన్  విజ్ఞప్తి

ఖైరతాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి) : బాలానగర్ కో ఆపరేటివ్ ఇండ స్ట్రీయల్ ఎస్టేట్ (సీఐఈఎల్) భూముల విక్రయంలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతోందని ఆ సంస్థ డైరెక్టర్ సయ్యద్ బద్రుద్దీన్ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ప్రతినిధి అఖిల్ తో కలిసి ఆయన మాట్లాడుతూ.. 1963లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో బాలానగర్ సీల్ సొసైటీ ఏర్పడింద న్నారు.

1990లో సొసైటీ సంగారెడ్డి జిల్లా గుమ్మడిడాల గ్రామంలో 161 ఎకరాల భూమిని స్థానిక గ్రామస్థుల వద్ద కొనుగోలు చేసిందన్నారు. అది పూర్తిగా సీల్ సొసైటీకి రిజిస్ట్రేషన్ అయ్యిందన్నారు. అంతేకాకుండా అందులోని సుమారు ఒక ఎకరన్నర స్థలాన్ని 159 ప్లాట్లుగా అభివృద్ధి చేశారన్నారు. కొన్ని ప్లాట్లను కొందరు సభ్యులకు అలాట్ చేయ గా, మిగలినవి ఇంకా సొసైటీ ఆదీనంలో ఉందన్నారు.

ప్రస్తుతం 161 ఎకరాల స్థలాన్ని కొందరు సొసైటీ డైరెక్టర్లు జిల్లా సహకార శాఖలోని ఓ అధికారితో కుమ్మక్కై ఓ ప్రైవేట్ డెవలపర్ కు అతి తక్కువ ధరకే కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో దీనిపై కోర్టును ఆశ్రయిస్తే స్టేటస్ కో ఇచ్చిందని, అయినప్పటికీ స్థలాన్ని విక్రయించేందుకు ఎంవోయు సైతం చేసుకునేందుకు సిద్ధపడుతున్నారని, రూ.400 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభు త్వం స్పందించి ఈ వ్యవహారం పై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.