calender_icon.png 3 August, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు: ఎస్సై రామకృష్ణ

03-08-2025 01:04:01 AM

శివారులో వ్యవసాయ పంటలను పరిశీలిస్తున్న ఉన్న ఎస్సై

నాగల్ గిద్ద(విజయక్రాంతి): గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని నాగల్ గిద్ద ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు శనివారం మండల పరిధిలోని ఇరక్ పల్లి గ్రామం మేఘ తాండ ,కూబ తాండ, శివారులలో వ్యవసాయ పంటపొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గంజాయి వ్యవసాయ పంటలోకూడా సాగు చేసే అవకాశం ఉన్నందున పరిశీలిస్తున్నామని వారు తెలిపారు ఎవరైనా సాగు చేస్తే తమకు సమాచారం అందించాలని అందించిన వారి పేరు గోప్యంగా ఉంచుతామన్నారు. వాహనాలకు సరైన పత్రాలు వెంట తీసుకొని రావాలని డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు వారు వెంట సిబ్బంది ఉన్నారు.