calender_icon.png 23 December, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు

23-12-2025 01:36:16 AM

బోయినపల్లి : డిసెంబర్22( విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామ సర్పంచిగా చల్ల శ్రీనివాస్ రెడ్డి, రామన్నపేట సర్పంచ్ గా చింతలపల్లి కవిత వెంకటరెడ్డి సర్పంచిగా గ్రామపంచాయతీలో బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఆ గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు వారితో గ్రామపంచాయతీ రిజిస్టర్ లో సంతకం తీసుకుని సర్పంచ్ గా బద్వేల్ అప్పగించారు. అదేవిధంగా ఆ గ్రామపంచాయతీలో నూతన సర్పంచులు ఉపసర్పంచి వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులకు పలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లను గ్రామస్తులు, అభిమానులు అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామాల్లో ప్రజలతో సహపంక్తి భోజనం చేశారు.