calender_icon.png 16 July, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియంలో వన మహోత్సవం

15-07-2025 08:58:51 PM

నిర్మల్,(విజయక్రాంతి): వాతావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఫైజాన్ అహ్మద్ పిలుపునిచ్చారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఖానాపూర్ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో మంగళవారం వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భవిష్యత్ తరాలకు సురక్షిత పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.