calender_icon.png 17 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ జేఏసీ న్యాయసాధన దీక్ష

17-11-2025 12:25:23 AM

ముకరంపుర, నవంబరు 16 (విజయ క్రాంతి): బీసీ లకి 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆదివారం బీసీ జాక్ న్యాయ సాధన దీక్షను బీసీ జేఏసీ నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఆది మల్లేశం, నాగుల కనుకయ్య, నర్సింగోజు శ్రీనివాస్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ లకి 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంఘాల నాయకులను, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకపోయి కేంద్రం పై ఒత్తిడి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ శీతకాల పార్లమెంటులో సమావేశాలలో మొత్తం కాంగ్రెస్ ఎంపీలు 42 శాతం రిజర్వేషన్లు అంశం పైన చర్చ జరపాలని,బిల్లు ఆమోదం పొందేలా చూడాలని,రాజ్యాంగ సవరణ చేసి బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి బిల్లుకు చట్ట బద్ధత కల్పించేలా కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ జాక్ నాయకులు జీఎస్ ఆనంద్, ఉమా మహేశ్వర్, గున్నాల కన్నాంబ, మహేష్, బాబన్న, అంజద్, నల్లగోని శ్రీనివాస్, నితిన్, మహేందర్ ముదిరాజ్, గట్టు సత్యం, తదితరులుపాల్గొన్నారు.