calender_icon.png 22 December, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందె విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ ప్రమాణ స్వీకారం

22-12-2025 12:03:42 AM

బక్కి వెంకటయ్య- తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ 

సిద్దిపేట, డిసెంబర్ 21 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని అందే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో నూతనంగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. అందే విలేజ్ డెవలప్మెంట్ ట్రస్టు ప్రారంభించి నూతన కార్యవర్గంతో ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పట్ల రాజకీయాలు చేయకుండా ఒకే కుటుంబ సభ్యులుగా ఒకరికి ఒకరు సహకరిస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడాలని అన్నారు.

ట్రస్ట్ పూర్తి నియమ నిబంధనలు పాటించాలన్నారు. ట్రస్టుకి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా గ్రామ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని అన్నారు. అనంతరం చైర్మన్ వెంకటయ్య ట్రస్టు కి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. చైర్మన్ వెంకటయ్య ట్రస్టు సభ్యులు, గ్రామస్థులు శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్మెంట్ చైర్మన్ బుర్ర సతీష్, ప్రధాన కార్యదర్శి అందె ప్రవీణ్, ఉపాధ్యక్షులు జక్కుల రాజయ్య, వారాల రాజకుమార్, ఫక్రుద్దీన్ రామ్ రెడ్డి, లింగం, శివలింగం శ్రీనివాస్ రెడ్డి, రమణ,సతీష్, నవీన్, సుమన్, తదితరులు పాల్గొన్నారు.