calender_icon.png 19 November, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ ఆత్మగౌరవ పతాక అందెశ్రీ

19-11-2025 12:00:00 AM

  1. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డా.ఏనుగు నరసింహారెడ్డి  
  2. లోక కవి అందెశ్రీకి 108 మంది కవులతో కవిత్వ నివాళి

ముషీరాబాద్, నవంబర్ 18 (విజయక్రాం తి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి, జాతీయ తెలుగు సారస్వత పరిషత్ తెలంగాణ విభాగం, కుసు మ ధర్మన్న కళా పీఠం, పాలడుగు నాగయ్య కళాపీఠం, సమితి లక్షసాధన ఫౌండేషన్ సం యుక్త ఆధ్వర్యంలో లోక కవి అందెశ్రీకి ఘనం గా సంస్మరణ సభ, కవి కవి సమ్మేళనంతో అక్షర  నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి  పాల్గొని మాట్లాడుతూ నిక్కమునకు నిలువెత్తు ప్రతీక అందెశ్రీ అని  కొనియాడారు. ముందు గా ముద్రించుకున్న ‘పూలతోట‘, ‘అందేల సవ్వడి‘ అనే పుస్తకాలకు ఆయన రచయితగా లేకుండానే ముద్రించుకోవడం జరిగిందన్నా రు. దాన్ని బట్టి చూస్తే సమాజంలో పేరుపొందాలని ఆకాంక్ష లేని వ్యక్తిగా మనకు కనబడ తారన్నారు.

అందెశ్రీ వ్యక్తిత్వ శుద్ధి వల్లనే అతని కవిత్వానికి అంత ప్రతిష్టత ప్రఖ్యాతి వచ్చిందని అన్నారు. ప్రముఖ ప్రజా కవి,  ప్రజావాగ్గేయకారుడు జయరాజు అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన రాసిన పాటలను కమ్మని గొంతుతో ఆలపించారన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ కవులకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చారని పేర్కొ న్నారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి  మాట్లాడుతూ కవి కృషివలుడు, గొప్ప కవి గోదావరి నీళ్ల కవి అని అందెశ్రీతో ఉన్న అనుబంధాన్ని గద్గదస్వరంతో గుర్తు చేసుకున్నారు. గంట మనోహర్ రెడ్డి  మాట్లాడుతూ శంకర మహారాజు బిరుదురాజు రామరాజు చేత శిలగా ఉన్న అందే ఎల్లయ్య అందెశ్రీ అనే శిల్పంగా మారాడని అన్నారు. సభ అధ్యక్షుడు రామకృష్ణ చంద్రమౌళి  మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి అమూల్యమైన గీతాలను అందించిన అందెశ్రీని తెలంగాణ సమాజం ఎప్పటికి మరవదని చెప్పారు.

ఈ కార్యక్రమా న్ని బడే సాబ్, కేశిరాజు రాంప్రసాద్, ప్రజ్ఞా రా జు, కే. విశ్వనాథ్ రాజుల ఆధ్వర్యంలో కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు  రాధాకుసుమ108 మంది కవుల చేత కవితా గానం చేయించి అందెశ్రీకి అక్షర నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు రామకృష్ణ, చంద్రమౌళి, ప్రజ్ఞా రాజు, గజవెల్లి సత్యనారాయణ,  గంటా మనోహర్ రెడ్డి, పాలడుగు సరోజినీ దేవి, డాక్టర్ రాధా కుసుమ, డా.ఎడ్ల కల్లేశ్, లకుమల్ల జగన్, ఇ. చంద్రహాస్ తో పాటు తెలంగాణ నలుమూలల నుంచి కవులు కళాకారులు పాల్గొన్నారు.