calender_icon.png 19 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలమూరును వరించిన జాతీయ జల అవార్డు

19-11-2025 12:00:00 AM

పాలమూరును వరించిన జాతీయ జల అవార్డు

- కేటగిరీ 3లో మహబూబ్ నగర్ జిల్లాకు 3వ స్థానం

- కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్, నవంబర్ 17 (విజయక్రాంతి): జల్ సంచయ్ జన్ భాగీదారీ 1.0 విభాగంలో జాతీయ స్థాయిలో 3 వ కేటగిరి నందు మహబూబ్ నగర్ జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. మంగళవారం న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ చేతుల మీదుగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, డిఆర్డిఓ నర్సింహులు పురస్కారం లు అందుకున్నారు. రూ 25 లక్షల నగదు బహుమతి లభించింది.

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభి యాన్ కింద చేపట్టిన జల్ సంచయ్- జల్ భాగీదారీ (జేఎస్బీ) పథకం 2024- 25 సంవత్సరం లో  డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకం ద్వారా జల సంరక్షణ పనులు చేపట్టారు. జల సంరక్షణ కోసం చేపట్టిన ఈ పనుల్లో అత్యధి కంగా పనులు చేసినందుకు గాను మహబూబ్ నగర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ పథకం కింద జిల్లాలోని 16 మండలాల పరిధిలో 19,439 పనులు చేపట్టారు.

ఇం దులో గృహాల్లో మ్యాజిక్ ఇంకుడు గుం తలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, పత్తి చేలలో కుంటలు, ఎంఐ ట్యాంకులు, చెరు వుల పూడికతీత, ఊట కుంటలు, చెక్ డ్యాం లు, గుట్టల వద్ద కందకాలు, వరద కట్టలు, బోర్వెల్ రీచార్జి, స్ట్రక్చర్లు, రూప్ వాటర్ ఇంకుడు గుంతలను నిర్మించి నీటి సం రక్షణ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంపునకు చర్యలు చేపట్టింది. ఆయా వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఎప్పటికప్పుడు జల్ సంచయ్- జల్ భాగీదారి పోర్టల్లో నమోదు చేసి అవార్డు వచ్చేందుకు దోహదపడింది.

జిల్లాకు జల సంచాయ్ జన్ భాగీ దారీ పురస్కారం లభించడం పట్ల కలెక్టర్ విజయేందిర బోయి హర్షం వ్యక్తం చేశారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సమిష్టి కృషితో,విలువైన ప్రజల భాగస్వామ్యంతో ఈ పురస్కారం లభించిందని అన్నారు జిల్లాకు పురస్కారం రావడానికి కృషిచేసిన అధికారులు,ప్రజలు సహకారం, అందించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాకు పురస్కారం లభించడం పట్ల స్థానిక సంస్థల,అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్,అధికారులు,ప్రజా ప్రతినిధులు శుభాంక్షలు తెలిపారు.