22-01-2026 12:29:58 AM
బీఆర్‌ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి
సిద్దిపేట, జనవరి 21 (విజయక్రాంతి):మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఎన్ని కుట్రలు పన్నిన కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తాడని బిఆర్‌ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బిఆర్‌ఎస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. తల, తోక లేని ప్రశ్నలతో ప్రశ్నించే గొంతుకను ఆపలేరన్నారు.
గతంలోనే సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన ఇంకా బుద్ది రాలేదన్నారు. పెట్టుబడుల కోసం దావూస్ కి వెళ్ళిన ముఖ్యమంత్రి ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో ఎంత పెట్టుబడి తీసుకొచ్చారని ప్రశ్నించారు. హరీష్ రావును విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా బిఆర్‌ఎస్ భయపడేది లేదన్నారు.
సంక్రాంతి పండుగకు ఆంధ్ర వాళ్లకు ఉచిత టోల్గేట్ ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజ లకు బస్సు టికెట్ ను పెంచిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. తెలంగాణలో ఆంధ్ర సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారనీ చెప్పారు. ప్రతిపక్ష నాయకులను వేధించడం మానుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వానికి హీతువు పలికారు.