22-01-2026 02:01:27 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ టౌన్, జనవరి 21 (విజయక్రాంతి): కాజీపేట ఫాతిమా నగర్ లో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబి) పనులను బుధవారం సంబంధిత రోడ్లు భవనాల ఆర్ అండ్ బి శాఖ అధికారులతో కలిసి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని పనులు వేగవంతంగా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం సమ్మ క్క సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాకు ఆర్‌ఓబిని అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో సత్వరమే నిధుల మంజూరు చేసి పనులు ప్రారంభించామని, కానీ కొన్ని అని అనివార్య కారణాల వల్ల పనులు జాప్యం జరిగిందని, ప్రధానంగా ఈ బిడ్జి రైల్వే శాఖ పరిధిలో ఉండటం వల్ల నిర్మాణానికి అవసరమైన భారీ పరికరాలు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి ఆలస్యం జరిగిందని, అయిన ప్పటికీ అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ సమస్యను పరిష్కరిస్తున్నామని, రానున్న అతి కొద్ది రోజుల్లోనే కాజీపేట ఆర్‌ఓబి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
రోడ్లు భవనాల శాఖ అధికారులతో మాట్లాడి ఎన్‌ఐటీ నుంచి హంటర్ రోడ్డు వరకు రోడ్డు వెడల్పు పనుల ప్రక్రియను ప్రారంభించామని, ఈ పనులు పూర్తయితే నగరంలో రాకపోకలు సులభవంతం అవుతాయని తెలిపారు. అలాగే మేడారం జాతర దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాల తో పాటు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో వారికి ఎలాంటి ట్రాఫిక్ అంతరా యం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నగర నలువైపుల ఉన్న బ్రిడ్జిల పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి ఎమ్మెల్యేలందరం సమిష్టిగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్లు అబూబకర్, ఏనుకొంటి నాగరాజు, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, ఇతర అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.