calender_icon.png 22 January, 2026 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు

22-01-2026 12:29:10 AM

వికారాబాద్, జనవరి-21: శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పై నిందారోపణలు చేయడం సమంజసం కాదని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలో గల శాసనసభాపతి స్వగృహంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారాసింగ్ సంతోష్ కుమార్ లతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా తాండూర్ ఎమ్మెల్యే హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారని ఆయన గుర్తు చేశారు.

దళితున్ని సీఎంగా చేస్తే కేసీఆర్ అతనికింద పనిచేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సీఎంగా చేయలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితున్ని శాసనసభాపతిగా చేసి మంచి సంప్రదాయాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. 2014లో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసి బిఆర్‌ఎస్ పార్టీలో విలీనం చేసుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే లందరూ వారి నియోజకవర్గ అభివృద్ధి కొరకు సీఎంను కలుస్తున్నారు అని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశం మేరకు ఒక్కొక్క ఎమ్మెల్యేను పిలిచి విచారించిన విషయం జగద్విధితమే అని అన్నారు.

బి ఆర్ ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కూడా బొక్క బోర్ల పడిందా అన్న విషయం మరువరాదన్నారు. దళిత శాసనసభాపతిగా కొనసాగుతున్నందున కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. దళితునిపై మీకున్న అభిప్రాయం ప్రజలు గ్రహిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. మీ కుటుంబంలోనే కల్వకుంట్ల కవిత టిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులను తూర్పార పడుతున్న విషయం గ్రహించండి అని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు చిగుళ్ల పల్లి రమేష్ తదితరులు ఉన్నారు.