16-05-2025 12:25:57 AM
రామ్ పోతినేని ఇప్పుడు తన 22వ సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర ఒక హీరోగా, రామ్ ఆ హీరో అభిమానిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
అయితే మేకర్స్ గురువారం ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అని ప్రకటించారు. ‘బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్’ అనేది దీనికి ట్యాగ్‌లైన్‌గా ఇచ్చారు. గ్లింప్స్‌లో రామ్ థియేటర్‌కు వచ్చి టికెట్స్ అడిగి ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్తాడు. లవ్‌స్టోరీతోపాటు సినిమాలు, ఫ్యాన్స్ సందడి ఉండే సినిమాలా ఉండబోతోంది.