16-05-2025 12:23:33 AM
నితిన్ హీరోగా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘రాబిన్‌హుడ్’. ఉహించలేని గ్రిప్పింగ్ స్టోరీ లైన్‌తో, ప్రేక్షకులు కోరుకునే హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా శ్రీలీల నటించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.
ఇందులో కేతికశర్మ ‘అదిదా సర్‌ప్రైజు’ స్పెషల్ సాంగ్‌తో ఉర్రూతలూగించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా మే 10 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో ఓటీటీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు.