calender_icon.png 13 May, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.50 లక్షలకు పేదల పట్టా భూమి?

13-05-2025 12:43:22 AM

  1. మణికొండలో చెలరేగుతున్న అక్రమార్కులు

పేదలకు మంజూరైన పట్టా భూములను సొమ్ముచేసుకుంటున్న కబ్జాదారులు

తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

మణికొండ, మే 12: మణికొండలో అక్రమార్కులు చెలరేగుతున్నారు. పేదల పట్టా భూములను అక్రమంగా అమ్ముకుంటూ కో ట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.  పేద ప్రజల కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం 2006లో సర్వే నెంబర్ 261లో 278 పట్టాలు మంజూరు చేసింది. ఈ భూములపై స్థానిక రాజకీయ నాయకులు కన్నేశా రు. ఈ 278 పట్టా భూములతో పాటు మరికొన్ని స్థలాలకు నకిలీ పట్టాలు సృష్టించారు.

ఇలా దాదాపు 300 పట్టా స్థలాలను కబ్జా చేసి అమ్మారు. బుల్కాపూర్ కబ్జా చేసి స్మశానాలను ఆక్రమించి అక్కడ ఉన్న ఖాళీ స్థ లాలను దొంగ పట్టాల సృష్టించి అమ్మకాలు జరిపారు. తాజాగా 4 పేదల పట్టా భూములను ఒక్కోటి 50 లక్షల రూపాయలకు కబ్జా దారులు అమ్ముకోవడం చూస్తే వారు ఎంత గా బరితెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. స్థానిక శివాలయం ఎదురుగా దాదాపు 10 స్థలాలను ఒక్కొక్కటి 40 లక్షల రూపాయలకు అమ్మారు. ఇకనైనా భూ కబ్జాదారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

కలెక్టర్ చర్యలు తీసుకోవాలి 

ప్రభుత్వం పేదలకు ఇచ్చిన పట్టాలను క బ్జా చేసి అమ్ముకుంటున్న వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలి. 278 పట్టా ఇళ్లకు ఒక పార్క్, కమ్యూనిటీ హాల్ కూడా కట్టించాలి. కింది స్థాయి సిబ్బంది అక్రమాలపై దృష్టి సారించాలి.

  సిద్దప్ప, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు