calender_icon.png 3 August, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆలయంలో అన్నదానం

30-07-2025 06:01:27 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): హరిహర పుత్ర అయ్యప్ప స్వామీ ఆలయంలో ప్రతి నెల చివరి వారం నిర్వహించే మహా ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా బుధవారం వేరగడె గోవింద్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆలయ పూజారి నగేష్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి నెల చివరి బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు వేణుగోపాల్, వెంకట్ గౌడ్, వినాయక్, మల్లేష్, శ్యాం, సంతోష్, సాయి, విశాల్ లు పాల్గొన్నారు.