30-07-2025 05:59:28 PM
రూ.36342 నగదు..
25 కిలోల బియ్యం వితరణ..
వీర్నపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన జోగుల మనోహర్ అనే యువకుడు మతిస్థిమితం లేక ప్రమాదవశాత్తు ఇటీవల చనిపోయాడు. ఆయన యొక్క కుటుంబం అమ్మానాన్నలు కటిక పేదరికంలో ఉన్నారని గమనించిన గ్రామ యువకులు ఆ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలని చెప్పి అతని తల్లి కూడా అదే మాదిరిగా మతిస్థిమితం లేకుండా ఉంది. తన యొక్క తమ్ముడు కూడా గతంలో మతిస్థిమితం లేకుండా అనారోగ్యంకు గురై చనిపోయాడు. మనోహర్ కూడా గత కొన్ని రోజుల నుంచి మానసిక స్థితి బాగా లేక వివిధ గ్రామాలు తిరుగుతూ అనారోగ్యం గురయ్యాడు. ఇటీవలే స్వగ్రామం వచ్చిన మనోహర్ పంట పొలంలో పడి చనిపోయాడు.
ఒకవైపు భార్య పరిస్థితి ఇలా ఉంటే చిన్న కుమారుని మరణం మళ్ళీ పెద్ద కుమారుని మరణంతో వృద్ధాప్యంలో ఉన్న తండ్రి దిక్కు లేనివాడయ్యాడు. ఈ యొక్క తండ్రి చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని ఉమ్మడి గర్జనపల్లి జవహర్లాల్ నాయక్ తండా గ్రామం, సీతారాం నాయక్ తండా గ్రామం గర్జన పల్లి గ్రామ యువకులు నడుం బిగించారు. అందరూ కలిసి ఒక్కటై కుటుంబానికి తోడుగా ఆర్థిక చేయూత నివ్వాలని చెప్పి తలో కొంత పోగు చేసి రూ.36342/- నగదును జమ చేసి అదే విధంగా 25 కిలోల బియ్యాన్ని పోగుచేసి యొక్క మన తండ్రి తల్లికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు గజ్జెల ప్రశాంత్, అజ్మీరా నవీన్, నగరపు దేవేందర్, చిన్నం దేవేష్, ఎలగందుల చిరంజీవి, జోగుల నరేష్, జోగుల కాంతయ్య మంజుల, అజ్మీరా గణేష్, వినయ్, తిరుపతి, న్యాత మోహన్, చంద్రయ్య, నవత తదితరులు పాల్గొన్నారు.