26-09-2025 12:00:00 AM
ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): దేవి నవరాత్రు లు పురస్కరించుకొని ఘట్ కేస ర్ పట్టణంలో గోల్డెన్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టిం చిన అమ్మవారి మండపం వద్ద గురువారం అన్నదాన కార్య క్రమం నిర్వహించారు.
మున్సి పల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, గోల్డెన్ యువజన సంఘం సభ్యులు రామాంజీ, నరేష్ , కరుణాకర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
కడ్తల్‌లో
కడ్తల్, సెప్టెంబర్ 25: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాల వైభవంగా కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్ మహేశ్వరం ఆమనగల్ షాద్నగర్ శేర్లింగంపల్లి మహేశ్వరం ఇబ్రహీంపట్నం నియోజక వర్గల లో భక్తులు ఏర్పాటుచేసిన అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి.
కడ్తాల్ మండలంలోని ఎక్కువైపెల్లి గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన వితరణ కార్యక్రమం ఎమ్మెల్యే ప్రారంభించారు.