23-05-2025 02:12:47 AM
రూ.157.5లక్షల నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.
భద్రాద్రి కొత్తగూడెం, మే 22 (విజయక్రాంతి)మారుమూల గ్రామాలు, గిరిజన గుంపులును మరింత అభివృద్ధి చేసి చూపెడతానని కొత్తగూడెం శాసనసభసభ్యులు కూనంనేని సాంబశి వరావు ప్రజలకు హామీ ఇచ్చారు. గురువారం మండల పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీల్లో రూ.157.5లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ పల్లెల్లో ప్రగతి కోసం ప్రత్యేక ప్రణాళిక రచించి అన్ని విధాల అభివృద్ధి పరచడానికి ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో తనపై అపారమైన నమ్మకంతో నమ్మి ఓటేసి గెలిపించిన ప్రజలకు మౌలిక వసతులు కల్పన బాధ్యతను విస్మరించనని హామీ ఇచ్చారు . పోడు పట్టాల సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ తహసిల్దార్ దార ప్రసాద్, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, పం చాయతీరాజ్ రామకృష్ణ, ఎలక్ట్రికల్ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, కాంగ్రెస్ నాయకులు ఎర్రంశెట్టి ముత్తయ్య,
బరపటి వాసు, సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొండా వెంకన్న, సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.