calender_icon.png 2 October, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ దుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో అన్నప్రసాదం

02-10-2025 12:26:53 AM

కామారెడ్డి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ దుర్గా సేవా సమితి, ( B.ౄ.S.S ) భారత్ రోడ్, ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారి సన్నిధిలో బుధవారం అన్నప్రసాద వితరణ ( అన్నదానం ) కార్యక్రమం నిర్వహించారు.  అన్నప్రసాదం స్వీకరించాడనికి 45, 46, 47 వార్డుల నుండి భారత్ రోడ్, పెద్ద బజార్, గడిరోడ్, చిన్న కసాబ్ గల్లీ, కమ్మరి గల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అన్నప్రసాదం స్వీకరించారు. 

అన్నప్రసాద కార్యక్రమం లో భారత్ దుర్గా సేవా సమితి ప్రతినిధులు గెరిగంటి లక్ష్మినారాయణ, బోడ్డు కుమార స్వామి, తాటిపల్లి సునీల్, చెన్నం స్వామి, కాకర్ల రవికుమార్, బట్టు భాస్కర్, బోడ్డు శ్రావణ్, మంత్రి బాలి, చింతల రాజు, సంగమేశ్వర్, సాయికుమార్, సాయి ఈశ్వర్, గెరిగంటి నిఖిల్, సుశీలు, పాండు, మధు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.