27-09-2025 12:08:48 AM
డాక్టర్ వీరస్వామి :
ఎన్నో పోరాటాలు, మరెంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టంగా 2014లో ఏర్ప డింది. భౌగోళికంగా పీఠభూమి ప్రదేశమైన ఈ ప్రాంతంలో విస్తారమైన ఖనిజ సంపద, కృష్ణ, గోదావరి, సరస్వతి మొదలైన జీవనదులతో ప్రకృతి సిద్ధ ప్రత్యేకత సంతరించుకున్న ప్రాంతమిది. ప్రపంచలోనే ఎక్కడా లేనటువంటి గొప్పనైన మన సం స్కృతి లో భాగమైన ప్రకృతి పూల పండు గ బతుకమ్మను ఇక్కడి ఆడపడుచులు ఘనంగా ఆడతారు, ఆరాధిస్తారు.
కాకతీయు లు, శాతవాహనులు, గోల్కొండ నవాబు లు పరిపాలించిన ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ప్రదేశమిది. దేశంలోనే తెలంగా ణకు ఒక విశిష్ట లక్షణం ఉంది. విభిన్న మతాలు, కులాలు, భాషలు, నాగరిక - ప్రాచీన, పట్టణ,- గ్రామీణ, అటవీ ప్రాంతాలతో కూడుకున్న భూభాగం. తెలంగాణ లో జనాభా ప్రకారం చూస్తే బీసీలే అత్యధి కం. నిజాం నవాబులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూ నిస్టు-కాంగ్రెస్ కొట్లాట, నక్సలైట్-పోలీస్ కాల్పులు, ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం తొలి, మలి దశల్లోనూ బీసీలు అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు.
ఇందు లో చదువుకున్న బీసీ విద్యార్థి, యువకిశోరాలే ఎక్కువగా ఉన్నారు. ఎన్నో ఆశలతో, ఆశయాలతో అమాయకంగా అగ్ర కుల నాయకులను నమ్ముకొని వారి వెనకాల అనుచరులుగా అన్ని పార్టీల్లో పని చేస్తున్నారు. ఏమి ఆశించకుండా నిస్వార్థంగా సేవలు అందిస్తూ తమకున్న ఆస్తిని అమ్ముకొని లేదా పోగొట్టుకొని, కేసుల పాలై, కొద్దో గొప్పో తమకున్న అనుభవాన్ని ఆయా పార్టీలకు జోడిస్తూ వారిని అంద ల మెక్కించి, తమకు ఏదో చేస్తారని భంగపడ్డ వారే బీసీలు. అగ్ర కులాల పార్టీల వంచనకు, నాయకుల ద్రోహానికి బలైన వారే వెను కబడిన కులాల వారు.
అన్ని పార్టీలకు ఊడిగం
హైదరాబాద్ రాష్ర్టం ఏర్పడిన తర్వాత విశాలాంధ్రలో ప్రజారాజ్యమని నినాదమిచ్చిన కమ్యూని స్టులను నమ్ముకుంటూ వచ్చారు బీసీలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో కూడా అన్ని రకాల పార్టీలను నమ్ముకొని పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలపరచి తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదానికి బ్రహ్మరథం పట్టింది కూడా బీసీలే అన్న సంగతి మరువద్దు.
కానీ ఆ పార్టీ కమ్మ కులంతో పాటు కోస్తాంధ్ర అగ్ర కులాల ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టీ అని తర్వాత అర్ధం చేసుకున్నారు. ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టులు తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలతో దిక్కులేని పరిస్థితు ల్లో కాంగ్రెస్‌నే గెలిపించాల్సి వచ్చింది. ఉమ్మడి ఏపీకి మూడోసారి ముఖ్యమంత్రి అయిన రా మారావును వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు అధికారంలో కి వచ్చిన త ర్వాత తెలంగాణలో దోపిడి మరింత ఎక్కువైంది.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు జరిగిన పెద్ద మ నుషుల ఒప్పందాన్ని రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత ఒ ప్పందం ప్రకారం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పూర్తిగా అన్యాయం చేస్తున్నారని బీసీలు ఆనాడే గ్రహించారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు మాత్రమే శాశ్వత పరిష్కారమని భావించి మేధావుల ఆలోచనల ప్రకారం బీసీ విద్యార్థులు ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమంలో బీసీ బిడ్డ శ్రీకాంత్ చారి మొదలు వేలాది మంది విద్యార్థులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఆత్మ బలి దానాలు చేసుకున్నారు.
అడుగడుగునా అన్యాయం
అయితే ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసిన అప్పటి తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్‌ఎస్)ని, ఆ పార్టీ నాయకుడిని నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నాం. మొదటి సారి అధికారాన్ని చేపట్టిన కేసీఆర్ ఒక సంవత్సర కాలం పాటు ఉద్యమంలో వ్యక్తం చేయబడిన అంశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని, పథకాలు ప్రవేశపెట్టి పాలన కొనసాగించారు. కానీ తర్వాత మెల్లిగా ఉద్యమ లక్ష్యాలకు దూరంగా జరుగుతున్న సమయంలో కొంతమంది బీసీ మేధావులు దాన్ని గుర్తించినప్పటికీ కొత్తగా ఏర్పడ్డ రాష్ర్టమని భావించి మిన్నకుండిపోయారు.
అయినా బలమైన ప్రత్యామ్నా యం లేకపోవడం, అప్పుడే బీసీ నాయకుడైన ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జన సమితి ఏర్పాటు చేసినప్పటికీ అప్పటికీ అసమర్థ నాయకత్వమే రాజ్యమేలు తుంది. దీంతో 2019లో రాష్ట్రానికి రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు కూడా అప్పటి టీఆర్‌ఎస్‌ను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించి అధికారం కట్టబెట్టారు. అయితే రెండోసారి అధికారంలోకి వ చ్చిన తర్వాత టీఆర్‌ఎస్ నాయకత్వం తన నిజ స్వరూపాన్ని బయటపెట్టడం ఆరంభిం చింది.
తెలంగాణ సంపదను వే రే రాష్ట్రాలకివ్వడం మొదలు పె ట్టింది. ఇది గుర్తించిన బీసీ మే ధావులు టీఆర్‌ఎస్ వల్ల బీసీలకు పూర్తిగా అన్యాయమే జరు గుతుందని భావించారు. ఇకపై బీసీలంతా ఐక్యంగా సామాజిక న్యాయం కోసం పనిచేయడమే సరైనదని నిర్ణయించుకున్నారు. 2024 ఎన్నికలకు ముందు సామాజిక న్యాయంలో భాగమైన బీసీ వాదాన్ని బ లంగా ముందుకు తీసుకొస్తేనే బీసీలకు రా జ్యాధికారంలో వాటా దక్కుతుందని మే ధావులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో బీసీ సంఘాలు ఉద్యమ నాయకుడు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం వద్దకు వెళ్లి ‘తెంగాణ జన సమితి తరఫున బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించండి’ అని విజ్ఞప్తి చేశాయి. కానీ బీసీ సంఘాల మాటను కోదండరాం పెడ చెవిన పెట్టడంతో ఆ తర్వాత తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ (టీడీఎఫ్) ఏర్పా టు చేసిన సుదమల్ల వెంకటస్వామిని కలిశారు. ఆయన నాయకత్వంలో పది చిన్న పార్టీల కూటమి కలిసి సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పని చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో సీపీఐ ఆఫీసులో సామాజిక తెలంగాణ ఫ్రంట్ (ఎస్‌టీఎఫ్), బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో మరొక సమావేశం నిర్వహించిన బీసీ మేధావులు అంతా కలిసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేయాలని తీర్మానం చేసుకున్నారు.
బీసీల పట్ల నిర్లక్ష్యం
అప్పటికే రాష్ట్రంలో నియంతృత్వ పాల న కొనసాగిస్తున్నారని పేరు తెచ్చుకున్న కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ‘కేసీఆర్ చేతిలో ఆగమైన తెలంగాణ’ అనే పుస్తకం అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. బీసీల ఆవశ్యకతను గుర్తించిన రేవంత్ రెడ్డి దీనిని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఎన్నికల ప్ర చారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.
ఇదంతా గమనించిన బీజేపీ కూడా తా ము అధికారంలోకి వస్తే బీసీనీ ముఖ్యమంత్రి చేస్తామని వాగ్దానం చేసింది. 2024 ఎన్నికల్లో బీసీ వాదాన్ని బలంగా ఉపయోగించుకున్న కాంగ్రెస్, బీజేపీ చాలా లాభపడ్డాయి. మరోవైపు బీఆర్‌ఎస్ (పాత టీఆర్‌ఎస్) మాత్రం ప్రజల్ని, ప్రజాభిప్రాయాన్ని లెక్కచేయకుండా ఇష్టారీతిన పాలన కొనసాగించి, పార్టీలోని ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను గుర్తించడంలోనూ విఫ లమై బొక్కబోర్లా పడింది.
అలా బీసీలను నిర్లక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చె ల్లించుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది బీసీ నాయకులకు టికెట్లివ్వకుండా చివరి వరకు నాన్చి, ఇచ్చిన చోట రెబల్స్ చేత నామినేషన్లు వేయించి బీసీల ను ఓ డించడం గమనించాల్సిన అంశం. అందుకే బొటాబొటి సీట్లతో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ బీసీలకు42 శాతం రిజర్వేషన్లు అంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పటికీ గవర్నర్ వద్దే ఫైల్ ఆగిపోవడం చూస్తే అది కేవలం హడావిడి అని బీసీలకు అర్థమయ్యింది. దీంతో నిజమైన బీసీ రాజ్యాధికార ఉద్యమం ఇప్పుడే మొదలైందన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అవస రం చాలానే ఉంది.
వ్యాసకర్త సెల్: 80757 01645