07-11-2025 05:50:26 PM
మండలంలోని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు,పాఠశాలల్లో సామూహిక ఆలాపన
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): స్వాతంత్ర పోరాట ఉద్యమ స్ఫూర్తికి ఊతమిచ్చిన బంకిన్ చంద్రచటర్జీ రచించిన వందేమాతర గేయానికి నేటికీ 150 వసంతాలు పూర్తయింది. ఈ సందర్భంగా మండల కేంద్రం అర్వపల్లిలో ఉదయం10 గంటలకు సామూహిక వందేమాతర గేయాన్ని ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలు,పాఠశాలల్లో ఏకకంఠంతో గీతాలాపన చేశారు. ముక్తకంఠంతో గేయాన్ని ఆలపిస్తున్న సమయంలో ఒక్కసారిగా దేశ సమైక్యత, సౌబ్రాంతృత్వం వెల్లివెరిసింది. కార్యక్రమాల్లో తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎస్సై ఈట సైదులు, ఎంపీడీఓ కుమారి పల్లపు ఝాన్సీ, ఎంఈఓ బాలునాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.