calender_icon.png 10 January, 2026 | 3:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మేరూ ఎంథూసియా 2026’

08-01-2026 12:47:30 AM

గచ్చిబౌలి స్టేడియంలో వార్షిక క్రీడోత్సవం

3 నుంచి 8 తరగతుల విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి) : మేరూ ఇంటర్నేషనల్ స్కూల్ తన వార్షిక క్రీడోత్సవం మేరూ ఎంథూసియా 2026ను గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా నిర్వహించింది. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ క్రీడోత్సవంలో 3 నుంచి 8 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, క్రీడలు సమగ్ర విద్యలో ఎంత కీలకమో చాటిచెప్పారు. ఈ సందర్భంగా మేరూ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు మేఘనా గోరుకంటి జుప ల్లి మాట్లాడుతూ.. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో శారీరక విద్య కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఫిట్నెస్ అనేది కేవలం శారీరక బలం మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వా సం, సహనశక్తి, స్వీయ నియంత్రణ, జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని ఆమె పేర్కొన్నారు. మే రూ ఎంథూసియా 2026లో ప్రత్యేక ఆకర్షణగా 8వ తరగతి విద్యార్థుల ఎన్సీసీ పరేడ్ నిలిచింది. ట్రాక్ అండ్ ఫీల్ పోటీల్లో 3 నుం చి 8 తరగతుల విద్యార్థులు పట్టుదల, కృషి, క్రీడాస్ఫూర్తితో పోటీ పడ్డారు. తల్లిదండ్రుల కోసం నిర్వహించిన ప్రత్యేక రేస్ ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని జోడించి, పాఠ శాలతల్లిదండ్రుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది.