10-01-2026 02:58:02 PM
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
కొమురవెల్లి,(విజయ క్రాంతి): క్రీడలు మానసికంగా ఉల్లాసాన్నిస్తాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కొమరవెల్లిలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బిఆర్ఆర్ ఫౌండేషన్ వారి క్రికెట్ పోటీల నిర్వహణలో భాగంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని, ప్రారంభించి, మాట్లాడుతూ క్రీడలతో శారీరక పటిష్టతోపాటు మానసికంగా దృఢత్వం సంతరించుకుంటుందన్నారు. క్రీడలలో పాల్గొనేవారు క్రీడా స్ఫూర్తి కలిగియుండి గెల్పోటములు సహజంగా తీసుకుంటూ, ఓడినవారు మరోసారి గెలవాలని ప్రయత్నిస్తారన్నారు.
గ్రామీణ యువతి యువకులను ఇటువంటి క్రీడా పోటీలలో పాల్గొనేలా చేసి వారి మానసిక ఆనందాన్ని పెంపొందిస్తున్నందుకు బి ఆర్ ఆర్ ఫౌండేషన్ కు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొంగు రాజేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గొల్లపల్లి పద్మాఅంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు ముత్యం నరసింహులు, గీస భిక్షపతి,సిల్వేరు సిద్ధప్ప, ఎరుపుల మహేష్, పడగన్న గారి మల్లేశం, పచ్చిమడ్ల స్వామి, స్వాములపల్లి కనుక చారి తదితరులు పాల్గొన్నారు.