10-01-2026 03:05:34 PM
ఆలయ ధర్మకర్తలకు ఆశీర్వదించిన నాగ సాధువులు
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తాండ యాడి బాపూ గడ్ లో శనివారం నాగ సాధువులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్ చెందిన నాగ సాధువులు యాడి బాపు గడ్ లో వెలసిన శ్రీ మావురాల ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న సద్గురు శ్రీ సంత సేవాలాల్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించి వివరాలను ఆలయ ధర్మకర్తలైన
శ్రీ సురేందర్ నాయక్ మహారాజ్, శాంతాదేవిలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ధర్మకర్తలకు నాగ సాధువులు నూతన వస్త్రాలను అందించి..రానున్న రోజుల్లో యాడికి బాపు గడ్ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఆశీర్వదించారు.