calender_icon.png 11 January, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసలు రియల్టర్ కేటీఆరే

10-01-2026 02:57:43 PM

బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవటం ఉండదు 

హైదరాబాద్ భూములు అమ్మిన ఘనత బీఆర్ఎస్ దే

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(MLC Mahesh Kumar Goud) గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం గతంలో కంటే ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకోవడం అనేది ఉండదని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని స్వయంగా కవిత బయటపెడుతోందని మహేష్ గౌడ్ వెల్లడించారు. కవిత అడుగుతున్న ప్రశ్నలకు కేటీఆర్, హరీశ్ రావు నుంచి సమాధానాలు రావట్లేదన్నారు. పక్కా ప్రణాళికలతో మున్సిపల్ ఎన్నికల బరిలో దిగుతామని తెలిపారు. సమన్వయ లోపం లేకుండా ముందుకెళ్తామని మహేష్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్ భూములు(Hyderabad lands) అమ్మిన ఘనత బీఆర్ఎస్ దే అన్నారు. అసలు రియల్టర్ కేటీఆరే అంటూ టీపీసీసీ అధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేశారు.